శృతి హాసన్..ఈ దక్షిణాది ముద్దుగుమ్మ కమల్ హాసన్ కూతురు. తన నటనతో, డాన్స్ తో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.ఈ భామ నటించిన ప్రతీ చిత్రం సూపర్ హిట్ అనే చెప్పాలి. ఇక అసలు విషయానికి వస్తే ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం చాలా గ్యాప్ తీసుకొని సినిమాలకు దూరంగా ఉంటుంది. ఎందుకు అనే విషయానికి వస్తే శృతి రిలేషన్స్ లో ఉందనే వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఈ హీరోయిన్ కు ఈ రూమర్స్ కొత్త కాదనే చెప్పాలి. ఇదివరకే సురేష్ రైనా, సిద్దార్థ, విక్రం లాంటి వాళ్ళతో రిలేషన్ లో ఉన్నట్టు చాలా వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు ఈ ముద్దుగుమ్మ వాటిని పక్కన పెట్టి సినిమాల్లో మల్లా చురుగ్గా పాల్గొనాలని నిర్ణయించుకుందట. అంతేకాకుండా తనకి రెండు అఫైర్స్ ఉన్నాయని ఇప్పుడు వాటికి దూరంగా ఉన్నానని చెప్పుకొచ్చింది. రిలేషన్ అనేది జీవితం అంతా ఉండాలని మొదలుపెడతాం అని కాని అన్నిసార్లు ఒకేలా ఉండదని చెప్పింది.