బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తున్న రియాల్టీ షో ‘బిగ్బాస్ సీజన్3’. నాగార్జున వ్యాఖ్యాతగా వ్యహరిస్తున్న ఈ కార్యక్రమంలో ఈ ఆదివారం బిగ్బాస్ హౌస్ నుంచి నటి హిమజ ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. ఎలిమినేషన్ తో బయటకు వచ్చిన హిమజ కన్నీటి పర్యంతమైంది. బయటకి వచ్చిన తర్వాత హిమజ హౌస్ మేట్స్ గురించి మాట్లాడుతూ అందరిపై తనదైన శైలిలో గుడ్ , బ్యాడ్, అగ్లీ అంటూ కామెంట్స్ చేసింది.. తాజాగా ఓ న్యూస్ చానెళ్లుకు ఇంటర్వూ ఇచ్చింది. యాంకర్ అడిగిన ప్రశ్న..బిగ్ బాస్ లో కి అందరు గేమ్ ఆడాలి..గెలవాలి అని వెళ్లారు మద్యలో ఆ బంధాలు..అనుబంధాలు ఎందుకు వస్తున్నాయి ఇంట్లో వాళ్ల మద్య అన్నారు. వెంటనే హిమజ కొందమందికి ప్రాశాంతత ఎలా వస్తుందంటే నిందలు అన్ని పక్కవారి మీద వేసి..వీళ్లకు రీజన్ ఎదో అనేసుకోని..ఎవర్ని ఒకర్ని అనేసుకోని కాని వాళ్లకి నైట్ కి నిద్రపట్టదు అన్నారు .అంతేకాదు ఒక కంక్లూజన్ కి వస్తే గాని వారు పడుకోలేరు అన్నారు హిమజ.