మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ సరికొత్త రికార్డును తన పేరిట లిఖించుకున్నారు. మొదట ఐదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా కొనసాగిన రెండో సీఎంగా మహారాష్ట్ర చరిత్రలో నిలిచిపోయారు. సరిగ్గా నలబై ఏడేళ్ళ కిందట 1962లో మహారాష్ట్ర సీఎంగా వసంతరావు నాయక్ పూర్తి కాలం పదవీలో కొనసాగారు. అయితే ఇప్పటివరకు ఆరవై ఏళ్ల మహారాష్ట్ర చరిత్రలో మొత్తం ఇరవై ఆరు మంది ముఖ్యమంత్రులుగా పనిచేశారు. వీరిలో ఎన్సీపీ అధినేత శరద్ పవార్ అత్యధికంగా నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన కానీ పూర్తి కాలం ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించలేకపోయారు.
