టాలీవుడ్ లో వివాదాలకు తెరలేపుతూ సంచలనాలు సృష్టించే డైరెక్టర్ ఎవరైనా ఉన్నారు అంటే అది రాంగోపాల్ వర్మనే. అతడు డైరెక్ట్ చేసే ఒక్కో చిత్రం ఒక ప్రభంజనం అని చెప్పక తప్పదు. ప్రతీ దానికి ఒక చిరిత్ర ఉందని తన సినిమాల్లో చూపిస్తాడు. ప్రస్తుతం వర్మ చంద్రబాబుకు మరోసారి చుక్కుల చుపించానున్నాడు. ఈ మేరకు తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా అందరికి తెలియజేసాడు. “కమ్మ రాజ్యంలో కడప రెడ్లు” లోని “బాబు చంపేస్తాడు” అనే పాట రేపు 24th’ మంగళవారం సాయంత్రం వీర బ్రహ్మ ముహూర్తం అయిన 4 గంటల 37 నిమిషాలకు విడుదల చేయబోతున్నాం. దయచేసి విని ఆనందించకండి అంటూ ట్వీట్ చేసాడు. అయితే ఇక మరో ట్వీట్ లో చిన్న సవరణ…..”కమ్మ రాజ్యంలో కడప రెడ్లు” లోని “బాబు చంపేస్తాడు” అనే పాట ఇవాళ సాయంత్రం వీర బ్రహ్మ ముహూర్తం అయిన 4.37 pm కి విడుదల చేయబోతున్నాం అని చెప్పాను .. కాని ఇప్పుడు పరమవీర బ్రహ్మ ముహూర్తం అయిన 4.59 pm కి విడుదల చేయబోతున్నాం దయచేసి విని ఆనందించకండి… ఆలోచించండి అని ట్వీట్ చేసాడు.
చిన్న సవరణ…..”కమ్మ రాజ్యంలో కడప రెడ్లు” లోని "బాబు చంపేస్తాడు" అనే పాట ఇవాళ సాయంత్రం వీర బ్రహ్మ ముహూర్తం అయిన 4.37 pm కి విడుదల చేయబోతున్నాం అని చెప్పాను .. కాని ఇప్పుడు పరమవీర బ్రహ్మ ముహూర్తం అయిన 4.59 pm కి విడుదల చేయబోతున్నాం దయచేసి విని ఆనందించకండి… ఆలోచించండి pic.twitter.com/XNHBLfxpAS
— Ram Gopal Varma (@RGVzoomin) September 24, 2019