ఎంజీబీఎస్ బస్టాండ్ ఆర్ఎం కార్యాలయంలో రంగారెడ్డి ఆర్ఎం మీడియా సమావేశం నిర్వహించారు. ఈనెల 27వ తేదీ నుంచి అక్టోబర్ 7వ తేదీ వరకు ప్రత్యేక బస్సులు నడపాలని నిర్ణయించినట్లు ఆర్ఎం వరప్రసాద్ తెలిపారు. సాధారణ బస్సులకు సాధారణ టికెట్ ధరనే వసూలు చేస్తామని పేర్కొన్నారు. గత ఏడాది దసరాకు 4900 బస్సులు నడిపాం. ఈ దసరాకు 4,933 ప్రత్యేక బస్సులు నడుపుతున్నామని వెల్లడించారు. ఈ నెల 27వ తేదీ నుంచి వచ్చే నెల 3వ తేదీ వరకు అక్టోబర్ 4వ తేదీ నుంచి అక్టోబర్ 7వ తేదీ వరకు 3,236 బస్సులు నడుపుతున్నాం. అక్టోబర్ 4వ తేదీన 749 బస్సులు, అక్టోబర్ 5వ తేదీన 964 బస్సులు నడిపిస్తాం. అక్టోబర్ 6వ తేదీన 712 బస్సులు నడిపిస్తాం. అక్టోబర్ 7వ తేదీ, 8వ తేదీన 72 బస్సులు నడిపిస్తామని చెప్పారు. 964 బస్సులను ఏపీలోని వివిధ ప్రాంతాలకు ఏర్పాటు చేస్తామని, మిగితా వాటిని తెలంగాణలోని పలు ప్రాంతాలకు నడుపుతామని పేర్కొన్నారు.
