తెలంగాణ రాష్ట్రంలోని నల్లగొండ జిల్లాలో హుజూర్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెల్సిందే. ఈ క్రమంలో ఇప్పటికే అధికార టీఆర్ఎస్ పార్టీ తరపున బరిలోకి దిగే అభ్యర్థిగా గతెన్నికల్లో బరిలోకి దిగి స్వల్ప మెజార్టీతో ఓడిపోయిన శానంపూడి సైదిరెడ్డి పేరును ముఖ్యమంత్రి కేసీఆర్ ఖరారు చేశారు. తాజాగా హుజూర్ నగర్ ఉప ఎన్నికలకు టీఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ గా ఆ పార్టీ ఎమ్మెల్సీ ,విప్ పల్లా రాజేశ్వర్ రెడ్డిని నియమిస్తున్నట్లు ముఖ్యమంత్రి,గులాబీ దళపతి కేసీఆర్ ప్రకటించారు.హుజూర్ నగర్ ఉప ఎన్నికలకు నామినేషన్ కు అఖరి తేది ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖు. అక్టోబర్ ఒకటో తారీఖున నామినేషన్ల పరిశీలన జరగనున్నది. అక్టోబర్ ఇరవై ఒకటిన పోలింగ్ జరిగి.. అదే నెల ఇరవై నాలుగో తేదీన ఫలితాలు వెలువడనున్నాయి.