అక్టోబర్ నెలలో దసరా పండుగను పురస్కరించుకుని ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ ఇంతకుముందు ఎన్నడూ లేని బంపర్ ఆఫర్ ను ప్రకటించింది. దీంతో ఆన్ లైన్ వినియోగదారులకు అదిరిపోయే ఆఫర్స్ ను తీసుకొచ్చింది. అందులో భాగంగా సెప్టెంబర్ ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి వచ్చే నెల నాలుగో తారీఖు వరకు ‘బిగ్ బిలియన్ డేస్’ సేల్‌తో ఆఫర్లకు తెర తీసింది. దీంతో కళ్లముందే ఆదిరిపోయే ఆఫర్లు ఊరిస్తున్నా.. చేతిలో క్రెడిట్ కార్డు లేదే అని బాధపడుతున్న వారికి ఫ్లిప్‌కార్ట్ శుభవార్త చెప్పింది. ఎటువంటి కార్డులు అవసరం లేకుండా ఏకంగా లక్ష రూపాయల వరకు షాపింగ్ చేసుకునే అద్భుతమైన అవకాశాన్ని వినియోగదారులకు అందించేందుకు రెడీ అయింది. ‘ముందు కొనండి.. తర్వాత చెల్లించండి’ పేరుతో ఈ ఆఫర్‌ను అందుబాటులోకి తీసుకొస్తోంది. ఇందుకోసం ముందస్తుగా డౌన్ పేమెంట్ చెల్లించాల్సిన పని కూడా లేదని ఫ్లిప్‌కార్ట్ పేర్కొంది.
ఇందులో భాగంగా ఫ్లిప్‌కార్ట్ కస్టమర్లకు మూడు పేమెంట్ ఆప్షన్లు ఉంటాయి. అందులో మొదటిది.. జీరో వడ్డీతో తర్వాతి నెల చెల్లించడం. రెండోది జీరో వడ్డీతో మూడు నెలల్లో ఈఎంఐ ద్వారా చెల్లించడం. చివరిది 12 నెలల ఈఎంఐ విధానంలో చెల్లించడం. ఇందుకోసం ఎటువంటి ప్రాసెసింగ్ ఫీజు ఉండదు. కాకపోతే డిజిటల్ కేవైసీ ప్రాసెస్‌ను పూర్తిచేయాల్సి ఉంటుంది. పండుగ షాపింగ్ కోసం క్రెడిట్ కార్డులు ఉపయోగించకుండా, పర్సనల్ లోన్ తీసుకోకుండా ప్రోత్సహించేందుకే ఈ విధానాన్ని ప్రవేశపెట్టినట్టు ఫ్లిప్‌కార్ట్ తెలిపింది.
అసలు ఎలా దరఖాస్తు ఎలా చేసుకోవాలి?
1.తొలుత పాన్ నంబరు, ఇతర వివరాలు, ఎంత వరకు కొనుగోలు చేయాలనుకుంటున్నారన్న వివరాలను నమోదు చేయాలి.
2.రెండు నిమిషాల్లో పూర్తయ్యే కేవైసీ వివరాలను ఎంటర్ చేయాలి.
3.కార్డ్‌లెస్ క్రెడిట్ ఆప్షన్ ద్వారా షాపింగ్ చేసుకోవాలి.
4. మై అకౌంట్స్, కార్డ్‌లెస్ క్రెడిట్ ఆప్షన్‌లోకి వెళ్లి క్రెడిట్ లిమిట్‌ను చెక్ చేసుకోవచ్చు.
5.ఫ్లిప్‌కార్ట్ యాప్ ద్వారా వచ్చే నెల 15 కల్లా చెల్లించాలి.