తెలంగాణ రాష్ట్ర ప్రజలతో పాటు మహిళాలోకం ఎంతో ఘనంగా జరుపుకునే పండుగ బతుకమ్మ. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బతుకమ్మ పండుక్కి చీరల పేరిట పేదింటి ఆడబిడ్డలకు అందజేస్తుంది. తాజాగా మాజీ ఎంపీ ,తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలైన కవిత తెలంగాణ వ్యాప్తంగా బతుకమ్మ వేడుకలను చాలా ఘనంగా జరుపుకోవాలని కోరుకుంటూ బతుకమ్మ సంబురాలకు సంబంధించిన ఒక పోస్టర్ను విడుదల చేశారు. ఈసందర్భంగా కవిత మాట్లాడుతూ”సెప్టెంబర్ ఇరవై ఎనిమిదో తారీఖున పెత్రమాసతో మొదలయ్యే బతుకమ్మ వేడుకలు అక్టోబర్ ఆరున సద్దుల బతుకమ్మతో ముగుస్తాయి. ఎప్పటిలాగే జాగృతి ఆధ్వర్యంలో ఇటు రాష్ట్రంలో పాటు ప్రపంచ వ్యాప్తంగా బతుకమ్మ వేడుకలు ఘనంగా జరుపుకోవాలని”ఆమె పిలుపునిచ్చారు.