ఎగువ ప్రాంతాల నుండి వస్తోన్న వరదప్రవాహాంతో నిజామాబాద్ జిల్లా శ్రీరాంసాగర్ ప్రాజెక్టు కళకళలాడుతుంది. ప్రాజెక్టులోకి డెబ్బై నాలుగు వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో వచ్చింది.
నిన్న ఆదివారం సాయంత్రానికి మొత్తం ఐదు టీఎంసీల మేర వరద వచ్చి ప్రాజెక్టులోకి చేరింది. దీంతో ప్రస్తుతం పూర్తి స్థాయి నీటి మట్టం 1090అడుగులైతే తాజాగా నీటి మట్టం 1079.80అడుగులు ఇంది. ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 90.31టీఎంసీలైతే ప్రస్తుతం నీటి నిల్వ సామర్థ్యం 51.86టీఎంసీలకు చేరుకుంది.