ముకుంద’, ‘కంచె’, ‘లోఫర్’ లాంటి విభిన్నకథా చిత్రాలతో నటుడిగా తనని తాను ప్రూవ్ చేసుకొని ‘ఫిదా’, ‘తొలిప్రేమ’, ‘అంతరిక్షం’, ‘ఎఫ్ 2’ లాంటి సక్సెస్ ఫుల్ కమర్షియల్ చిత్రాలతో ఫుల్‌స్వింగ్‌లో ఉన్నారు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్. ప్రస్తుతం ఆయన హీరోగా పవర్‌ఫుల్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్‌లో 14 రీల్స్ ప్లస్ బేనర్‌పై రామ్ ఆచంట, గోపీ ఆచంట అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన చిత్రం ‘గద్దల కొండ గణేష్’ సెప్టెంబర్ 20న ప్రపంచవ్యాప్తంగా సినిమా విడుదలైంది.’గద్దల కొండ గణేష్’తో మరో హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నారు.అయితే తెలుగు రియాల్టీ షో ‘ఫీట్ అప్ విత్ స్టార్స్’. అనే కార్యక్రమంలో తాజాగా వరుణ్‌తేజ్ పాల్గొని ఎన్నో విశేషాలను అభిమానులతో పంచుకున్నారు. ఈ సందర్భంగా మంచులక్ష్మి ‘రాశీఖన్నా, సాయిపల్లవి, పూజాహెగ్డే ఈ ముగ్గురిలో నువ్వు ఎవరిని పెళ్లి చేసుకుంటావు? ఎవరిని చంపుతావు? ఎవరితో డేటింగ్‌కి వెళ్తావు?’ అని అడిగగా.. వరుణ్ వెంటనే ‘నేను సాయిపల్లవిని పెళ్లి చేసుకుంటాను. రాశీఖన్నాను చంపుతాను. పూజాహెగ్డేతో డేటింగ్‌కు వెళ్తాను’ అని సరదాగా సమాధానం చెప్పారు.
