తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త మున్సిపల్ చట్టం అమల్లోకి వచ్చింది. ఈ సందర్భంగా కొత్త మున్సిపల్ చట్టంపై అందరూ అవగాహాన పెంచుకోవాలి అని ఐటీ,పరిశ్రమల ,మున్సిపల్ & పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీ రామారావు.
అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాల సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ” 75గజాల్లోపు ఇంటి నిర్మాణానికి ఎలాంటి అనుమతులు అవసరంలేదు. కానీ 76-600గజాల్లోపు కట్టుకునే ప్రతి ఇంటి నిర్మాణానికి అనమతులు తప్పనిసరి”అని అన్నారు. మంత్రి కేటీఆర్ సభ్యులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానమిచ్చారు.
ఈ క్రమంలో కొత్త మున్సిపల్ చట్టానికి అసెంబ్లీ ఆమోదం తెలిపింది. అక్రమ నిర్మాణాలకు పాల్పడితే మూడేండ్లు జైలు శిక్ష తప్పదు.జిల్లాకు ఒకటి చొప్పున లేఅవుట్ అప్రూవల్ కమిటీని నియమిస్తామని..కోర్టు తీర్పు ప్రకారమే మున్సిపల్ ఎన్నికలు జరుగుతాయి. మున్సిపల్ ఎన్నికల్లో బరిలోకి దిగేవారు కొత్త మున్సిపల్ చట్టంపైఅవగాహాన పెంచుకోవాలని”మంత్రి కేటీఆర్ సూచించారు.