మెగాస్టార్ చిరంజీవీ హీరోగా, బాలీవుడ్, కోలీవుడ్, శాండల్‌వుడ్ నుంచి అమితాబ్, సుదీప్, విజయ్‌సేతుపతి ముఖ్య పాత్రధారులుగా పాన్ ఇండియా మూవీగా వస్తోన్న చిత్రం…సైరా. చరిత్రలో మరుగునపడిన తొలి స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి జీవితగాథ పై రూపొందించిన చిత్రమే…ఈ సైరా. దాదాపు 300 కోట్ల బడ్జెట్‌తో రూపొందించిన ఈ చిత్రం అక్టోబర్ 2 న వరల్డ్‌వైడ్‌గా రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే రిలీజైన సైరా మూవీ ట్రైలర్ కోటి వ్యూస్ దాటి సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. తాజాగా ఆదివారం నాడు ఈ చిత్రం ప్రీరిలీజ్ ఫంక్షన్‌ను హైదరబాద్‌లో గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ సందర్భంగా సైరా మూవీ టైటిల్ సాంగ్‌ను విడుదల చేశారు. ఓ..సైరా అంటూ సాగే ఈ టైటిల్ సాంగ్‌ను ప్రముఖ గాయని శ్రియా ఘోషల్ పాడగా, మరో సింగర్ సునిధి చౌహన్ కూడా గొంతు కలిపింది. ఈ చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన సైరా ఆడియో టైటిల్ సాంగ్ వీడీయోను చూస్తే ఈ పాటను కళాకారిణి అయిన తమన్నాపై చిత్రీకరించినట్లు తెలుస్తోంది. తమన్నా ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి ధైర్య సాహసాలను కీర్తిస్తూ ప్రజలను చైతన్యవంతులను చేస్తున్నట్లుగా చిత్రీకరించినట్లు తెలుస్తోంది. కాగా మరోగాయని కూడా ఉండడంతో ఇదే పాటలో నయనతార కూడా కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. పాట చివరలొ నయనతార కూడా గొంతు కలుపుతున్నట్లు తెలుస్తోంది. సైరా వంటి రేనాటి వీరుడి సాహసాలను ప్రతిబింబించేలా..ప్రసిద్ధ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి ఈ పాటకు అద్భుతమైన సాహిత్యం అందించగా…అమిత్ త్రివేది పేట్రియాటిక్ మ్యూజిక్ సైరా టైటిల్ సాంగ్‌ను ఎక్కడికో తీసుకెళ్లింది. మొత్తంగా సైరా టైటిల్ సాంగ్ విన్న ప్రతి ఒక్కరిని ఔరా అనిపిస్తోంది.
