క్రికెట్‌లో కొంత మంది ఆటగాళ్లకి అవకాశాలు రాక నిరాశపడితే.. మరికొందరికి అవకాశం వచ్చి అందరినీ నిరాశపరస్తుంటారు. ప్రస్తుతం టీమిండియా యువ వికెట్ కీపర్ రిషభ్ పంత్ చేస్తోంది అందరిని నిరుత్సాహపరచడమే. ఎంఎస్ ధోని ప్రత్యామ్నాయంగా జట్టులోకి వచ్చిన ఈ యువ ఆటగాడు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడంలో విఫలమవతున్నాడు. ఆదివారం చిన్నస్వామి స్టేడియం వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20లో పంత్(19) నిరుత్సాహపరిచాడు. తానేంటో నిరుపించుకుని విమర్శకుల నోటికి తాళం వేసే సువర్ణావకాశాన్ని పంత్ నేలపాలు చేశాడు. నిన్నటి మ్యాచ్‌లో నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన పంత్.. పేలవ షాట్‌తో మరోసారి ఔట్ విమర్శలపాలవుతున్నాడు. 13 ఓవర్‌లో ఫార్చూన్ బౌలింగ్‌లో అవుట్‌సైడ్ ఆఫ్ బంతిని వెంటాడి మరి గాల్లోకి లేపాడు. దీంతో లాంగాఫ్‌లో పీల్డింగ్ చేస్తున్న ఫెలూక్వాయో క్యాచ్ అందుకోవడంతో పంత్ పెవిలియన్ చేరాడు. దీంతో సోషల్‌మీడియా వేదికగా నెటిజన్లు పంత్‌పై మండిపడుతున్నారు. పంత్ క్రికెట్‌ను వదిలి పిల్లలతో ఆడుకుంటే మంచిదని విమర్శిస్తున్నారు.