ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పాముల పుష్ప శ్రీవాణి గురించి బహుశా తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారు ఉండరు.. అంతలా ఆమె క్రేజ్ సంపాదించుకున్నారు. గత ఐదేళ్ల పాలనలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు పుష్పశ్రీవాణిని ఎన్నిసార్లు పార్టీ ఫిరాయించాలని కోరినా ఆమె వైసీపీ వైపే నిలబడ్డారు. చివరికి ఆమెపై దాడులు చేసేంతవరకు టిడిపి ప్రయత్నించిందంటూ అర్థం చేసుకోవచ్చు. అయితే వారి కష్టాన్ని వారు వైఎస్ కుటుంబం పై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా జగన్ సీఎం అయిన వెంటనే డిప్యూటీ సీఎం గా పుష్పశ్రీవాణి నియమించడంతో పాటు గిరిజన సంక్షేమ శాఖ మంత్రిని చేసారు. అయితే తాజాగా పుష్పశ్రీవాణి సినిమాల్లో నటిస్తున్నారంటూ కొన్ని వార్తలు వస్తున్నాయి. జగన్ క్యాబినెట్ లో ఉండే ఒక రేర్ మంత్రిగా ఈమెకు సోషల్ మీడియాలో ఉన్న పాపులారిటీ ఉంది.
పుష్పశ్రీవాణి భార్యభర్తలిద్దరు కూడా అందంగా ఉంటారు.. చిన్న వయసులోనే ఉన్నారు అయితే ఈమె సినిమా వార్తల్లో కొంతవరకు వాస్తవం ఉంది. ప్రకృతి వ్యవసాయ ప్రాధాన్యతని తెలిపేలా అమృత భూమి అనే సినిమా రూపొందుతుంది.. ఈ సినిమా షూటింగ్ విజయనగరంలో జరుగుతోంది.. ఈ సినిమాలో పుష్ప శ్రీ వాణి టీచర్ రోల్ ప్లే చేస్తున్నారు. తాజాగా ఓ సన్నివేశాన్ని చిత్రీకరించారు.. అదే సినిమాలో అధికారి పాత్రలో జిల్లా కలెక్టర్ హరి నటించారు. ఈ సందర్భంగా శ్రీవాణి మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించేలా సినిమా రూపొందిస్తామన్నారు.
వ్యవసాయం ప్రాముఖ్యత తెలియజేసేలా సినిమా తీస్తున్నామన్నారు. ప్రజలను చైతన్యం చేయడానికి ఈ సినిమా తీసినట్లు చిత్ర యూనిట్ సభ్యులు తెలిపారు.. అయితే ఆమె అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఇతర ప్రాంతాల్లోని ఫ్యాన్స్ కూడా పుష్పశ్రీవాణి నటిస్తున్న ఈ సినిమా విజయవంతం అయితే ఆమె అందం అభినయం ఉన్న రాజకీయ నాయకురాలిగా కాకుండా సినిమాల్లో అవకాశాలు వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదని చెప్తున్నారు. త్వరలో పుష్పశ్రీవాణి ఒక ప్రముఖ నటీమణిగా అవుతారంటూ తమ తమ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.