తెలంగాణ రాష్ట్ర మంత్రి,టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి తన ఉదారతను చాటుకున్నారు. ఈ క్రమంలో రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళపల్లి మండలానికి చెందిన మేఘన అనే బాలిక గత కొంత కాలంగా వెన్నుముక సమస్యతో తీవ్రంగా బాధపడుతుండేది. తంగళపల్లిలోని ఇందిరానగర్లో సాంచాలు నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్న ఆశోక్ కు లహారి అనే భార్య, భావన మరియు మేఘన ఇద్దరు కూతుళ్లు.
భావన తొమ్మిది… మేఘన ఏడో తరగతి చదువుతున్నారు. మేఘనకు ఏడాది కింద వెన్నుభాగంలో నొప్పి రావడంతో ఆసుపత్రిలో చూపించారు. పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు వెన్నుముకలో సమస్య ఉంది. ఆపరేషన్ చేయాలని .. దానికి రెండు లక్షలవుతుందని తెలిపారు.
దీంతో వీరు తంగళపల్లి ఎంపీపీ పడిగెల మానస,రాజు దంపతులను ఆశ్రయించడంతో ఈ బాలిక విషయాన్ని వీళ్ళు మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. దీనికి స్పందించిన మంత్రి కేటీఆర్ లక్షతో కూడిన ఎల్వోసీ మంజూరు చేయించారు. ఆపరేషన్ కు అయ్యే మరో లక్షను మంత్రి కేటీఆర్ ద్వారా మంజూరు చేయిస్తామని ఆ బాలిక కుటుంబానికి ధైర్యాన్నిచ్చారు.