తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హారీష్ రావు ఈ రోజు సోమవారం సిద్దిపేట జిల్లా ముఖ్యమంత్రి కేసీఆర్ నియోజకవర్గ కేంద్రమైన గజ్వేల్ లో పర్యటించారు.
ఈ పర్యటనలో బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు మంత్రి హారీష్ రావు. ఈ కార్యక్రమానికి స్థానిక ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి,కలెక్టర్ వెంకట రెడ్డి పలువురు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి హారీష్ రావు మాట్లాడుతూ” వృద్ధులకు,వితంతువులకు ఆసరా రెండు వేల పదహారు రూపాయలు ఇస్తోన్న దేశంలో ఏకైక సీఎం కేసీఆర్ అని అన్నారు.
జిల్లా వ్యాప్తంగా మొత్తం మూడు లక్షల అరవై ఐదు వేల పైచిలుకు మహిళలకు బతుకమ్మ చీరలను అందజేస్తున్నాము. మళ్లీ బతుకమ్మ నాటికి జిల్లా అడబిడ్డలతో కల్సి కాళేశ్వరం నీళ్లతో బతుకమ్మ ఆడదామని అన్నారు. ఒకవైపు ఆర్థిక మాంద్యమున్న కానీ సంక్షేమాభివృద్ధి పథకాలు ఆగవు అని తేల్చి చెప్పారు మంత్రి హారీష్..