తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హారీష్ రావు బీజేపీ నేతలపై ఫైర్ అయ్యారు. ఈ క్రమంలో మంత్రి హారీశ్ రావు మాట్లాడుతూ” తెలంగాణలో యూనివర్సీటీల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేయకుండా బీజేపీ నేతలు కోర్టులల్లో కేసులు వేసి .. అడ్డుకుంటున్నారు అని విమర్శించారు.
ఒక వైపు గత ఆరేండ్లుగా జరిగిన రాష్ట్ర అభివృద్ధిపై ప్రధాని నుంచి ఆయా రాష్ట్రాల బీజేపీ సీఎంలు.. మంత్రులు.. ఎంపీలు ..కేంద్రమంత్రులు ప్రశంసిస్తుంటే మరోవైపు తెలంగాణ బీజేపీ నేతలు మాత్రం ఆరోపణలు చేస్తున్నారు అని ఫైర్ అయ్యారు. నిరుద్యోగ భృతిపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఆర్టీసీలో పనిచేసేవాళ్లకు త్వరలోనే వేతనాలు చెల్లిస్తామని ఈ సందర్భంగా స్పష్టం చేశారు.