కాజల్ ఆగర్వాల్ ఒక పక్క అందంతో.. మరో పక్క చక్కని అభినయం ఉన్న టాలీవుడ్ అగ్రనటి. యువహీరోల దగ్గర నుండి సీనియర్ హీరోల వరకు అందరి సరసన ఆడిపాడింది ఈ ముద్దుగుమ్మ.
ప్రస్తుతం సరైన హిట్ లేకపోవడంతో తెలుగులో అమ్మడుకు కాస్త గ్యాప్ వచ్చింది. కాజల్ అగర్వాల్ నిత్యం సోషల్ మీడియాలో తన అభిమానులకు అందుబాటులో ఉంటుందనే సంగతి తెల్సిందే.
ఈ క్రమంలో కాజల్ అగర్వాల్ కు చెందిన ఒక వీరాభిమాని ” నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. పెళ్ళి కూడా చేసుకోవాలని అనుకుంటున్నాను”అంటూ కాజల్ కు ప్రపోజల్ చేశాడు. దీంతో ఒక్కసారిగా ఊహించని షాక్ కు గురైన ఈ ముద్దుగుమ్మ కొద్దిసేపు తర్వాత సరే నన్ను పెళ్లి చేసుకోవడానికి ప్రయత్నించండి. కానీ అది అంత సులభమైన పని కాదు అని జవాబు ఇచ్చింది. దీంతో తెగ సంబరపడిన అభిమాని నేను ప్రయత్నిస్తూనే ఉన్నాను అని జవాబు ఇచ్చాడు.