ఇటీవల జరిగిన ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా ఓడిపోయిన సంగతి విదితమే. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత జరిగిన తొలి సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ మెజార్టీ స్థానాలను గెలుపొందిన కానీ వైసీపీ నుండి ముగ్గురు ఎంపీలను,ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలను చేర్చుకుని మరి అప్పట్లో మంత్రి పదవులను కూడా ఇచ్చింది. ఆ తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా ఓడిపోయింది.
అయితే నిన్న ఆదివారం తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ” తెలంగాణ రాష్ట్ర ప్రజలను నమ్ముకుని ముందుకెళ్తున్నాం. ఆరు నెలలుండగానే మేము ఎన్నికలకు వెళ్లాము. నాలుగున్నరేళ్లలో మేము చేసిన పాలన.. అమలు పరిచిన పథకాలపై నమ్మకంతోనే ఎన్నికలకు వెళ్లితే ప్రజలు మాకు బ్రహ్మరథం కట్టారు”అని అన్నారు.
ఆయన ఇంకా మాట్లాడుతూ” పక్క రాష్ట్రంలో ఆరు నెలలకు ముందు తాయిలాలు ప్రకటించి ఎన్నికలకెళ్లారు. నాలుగున్నరేళ్ల పాటు పాలనను,ప్రజాసంక్షేమాన్ని గాలికి వదిలేసి. చివరిలో ప్రకటించిన మోసపూరిత హామీలను ప్రజలు నమ్మరు. ఎక్కడైన సరే ప్రజలే బాసులే. వాళ్లకు మంచి చేస్తే ఆశీర్వదించి పట్టం కడతారు.ఇక నైన ఇక్కడ ఉన్న ప్రతిపక్ష పార్టీలు ప్రజల సమస్యలపై పోరాడుతూ మంచి బుద్ధి తెచ్చుకోవాలని”అన్నారు.