తెలంగాణలోని నల్లగొండ జిల్లా హుజూర్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికకు ఈ రోజు సోమవారం నోటిఫికేషన్ విడుదలయింది. ఈ ఎన్నికకు ఈ రోజు నుంచే నామినేషన్లు స్వీకరించనున్నట్లు ఎన్నికల కమిషన్ తెలిపింది.
ఈ నెల ముప్పై తారీఖు వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. అయితే అక్టోబర్ 3వ తేది నామినేషన్ల ఉపసంహారణకు అఖరి గడవు. అక్టోబర్ 21న ఉప ఎన్నిక నిర్వహించనున్నారు. అదే నెల ఇరవై నాలుగో తేదీన ఉప ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.