తాజాగా తూర్పు గోదావరి జిల్లా కచ్చులూరు వద్ద గోదావరిలో మునిగిపోయిన బోటును వెలికి తీసే పరిస్థితి ఇప్పుడే కనిపించడం లేదు. 300 అడుగుల లోపల బురద మట్టి, ఇసుకలో బోటు కూరుకుపోవడంతో ఈ పరిస్థితి నెలకొంది. ఇప్పటికే గల్లంతైన వారూ అందులో ఉండే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం బోటుకు తీసే అవకాశం లేదు. నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ అధికారులు కూడా బోటు ప్రమాదంపై సమీక్షించి ఇదే విషయం వెల్లడించారు. ప్రస్తుతానికి మృతదేహాల వెలికితీతపై మొత్తం యంత్రాంగం దృష్టి పెట్టిందని, కేంద్రంనుంచి ఎటువంటి సాంకేతిక సాయం కావాలన్నా అందివ్వడానికి సిద్ధమన్నారు.
ఇకపై ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదని, టూరిజం నిబంధనలు కఠినంగా ఉండాలన్నారు. ప్రైవేట్ బోటైనా, టూరిజం బోటైనా, ప్రభుత్వ సర్వీసు బోటైనా సరే అన్ని నిబంధనలు ఒకేలా ఉండాలన్నారు. అయితే ఈ బోటు తీయాలంటే వరద ఉదృతి తగ్గాలని గోదావరిలో నీటిమట్టం భారీగా తగ్గిన తర్వాత కేంద్రం నుంచి సాంకేతిక సాయం తీసుకున్న తర్వాతే బోటు బయటకు రానుంది. అలాగే మిగిలిన మృతదేహాలు కూడా బోటు కింద చిక్కుకుని ఉండవచ్చని భావిస్తున్నారు.