అమీర్‌పేట్ మెట్రో స్టేషన్ కింద జరిగిన ప్రమాదంలో ఓ యువతి మరణించింది. ఆదివారం సాయంత్రం భారీ వర్షం కురిసిన సమయంలో పై నుంచి పెచ్చులు ఊడి..ఆ సమయంలో అక్కడే ఉన్న మౌనిక అనే యువతిపై పడ్డాయి. శకలాలు పడడంతో తీవ్ర గాయాలపాలైన ఆమె అక్కడిక్కడే మృతి చెందింది. మెట్రో స్టేషన్‌లో జరిగిన ఈ ప్రమాదంపై ఎస్.ఆర్.నగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అత్యాధునిక వసతులతో, అత్యంత పకడ్బందీగా నిర్మించిన అమీర్‌పేట్ మెట్రో స్టేషన్ ఏడాది కూడా కాకముందే ఇలా పెచ్చులు ఊడడంపై ప్రయాణీకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. యువతి మరణం నేపథ‌్యంలో ఇప్పటి కైనా అన్ని మెట్రో స్టేషన్లలో భద్రతా ప్రమాణాలను మరింతగా మెరుగుపర్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
