జున్ను తినడం వలన శరీరంలోని రక్తనాళాలు దెబ్బతినకుండా కాపాడుకోవచ్చు అని తాజాగా నిర్వహించిన ఆధ్యయనమ్లో తేలింది. జున్నులో ఉండే యాంటీ ఆక్సిడెంట్ల వలన ఈ లాభాలు కలుగుతాయని పరిశోధకులు చెబుతున్నారు. రక్తపోటు లేని పలువురిపై అధ్యయనం చేసి ఈ సంగతిని కనిపెట్టారు. దాదాపు ఎనిమిది రోజుల పాటు కొందరికి ఒకే సమయానికి ఆహారం అందించారు. ఆ తర్వాత రక్తపోటును పరీక్షించారు. ఆహారంలో జున్ను లేకుండా సోడియం ఎక్కువగా తిన్నవారిలో రక్తనాళాలు తక్కువగా పనిచేసినట్లు గుర్తించారు.