తెలుగు బిగ్ బాస్ 3 ..సక్సెస్ ఫుల్ గా సాగుతుంది. బిగ్‌బాస్ తొమ్మిదో వారాంతానికి భలే ట్విస్ట్‌ఇచ్చాడు. లీకు వీరులు సైతం నోరు మెదపలేని విధంగా ఎలిమినేషన్ ప్రక్రియను చేపట్టి బిగ్‌బాస్ అంటే ఏంటో నిరూపించాడు. నామినేషన్‌లో ఉన్నదే ముగ్గురు అయితే అందులో డబుల్ ఎలిమినేషన్ అంటూ పెద్ద బాంబు పేల్చాడు. పైగా దీనికి తగ్గట్టు రిలీజ్ చేసిన ప్రోమోలో కొన్ని వివరాలు వెల్లడయ్యేలా దాన్ని కట్ చేశాడు. అయితే గత రెండు సీజన్ లలో ఎవరు ఎలిమినేట్ అవుతారో షో పూర్తి అయేవరకు తెలిసేది కాదు..కానీ సీజన్ 3 మాత్రం శనివారమే ఈ వారం ఎలిమేట్ అయ్యేది ఎవరో తెలుస్తుంది. ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుండి హిమజ ఇంటికి వెళ్ళబోతున్నట్లు పక్కాగా తెలుస్తుంది. మహేష్ విట్టా, హిమజ, రాహుల్‌లు ఈవారం నామినేషన్‌లో ఉండగా.. ఈవారం ఈ ముగ్గురిలో నామినేట్ కాబోయేది హిమజే అని పోలింగ్ ద్వారా తెలుస్తుంది.