తెలంగాణ రాష్ట్రం ఐటీ రంగలో దేశానికే ఆదర్శంగా నిలిచింది. ఐటీ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాం. ఈ రంగానికి చెందిన ఆఫీస్ స్పేస్ ఆక్యుపేషన్ లో హైదరాబాద్ నగరం బెంగుళూరును దాటిందని ఐటీ మరియు
మున్సిపల్ ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు అన్నారు.
బడ్జెట్ సమావేశాల్లో భాగంగా అసెంబ్లీలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ” ప్రస్తుతం ఐటీ రంగంలో పనిచేస్తోన్న ఉద్యోగుల సంఖ్య ఐదు లక్షలకు చేరుకుంది. అయితే ఉమ్మడి రాష్ట్రంలో ఈ సంఖ్య కేవలం మూడు లక్షలే అని ఈ సందర్భంగా గుర్తు చేశారు. నిన్న శనివారం శాసనసభలో జరిగిన ప్రశ్నోత్తరాల సమయంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అడిగిన పలు ప్రశ్నలకు మంత్రి కేటీఆర్ సమాధానమిచ్చారు.
మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ” పారిశ్రామిక రంగంలో రాష్ట్రం అనూహ్యామైన అభివృద్ధిని సాధించిందని అన్నారు. ప్రపంచ ఖ్యాతి చెందిన అమెజాన్ ,గూగుల్,ఫేస్ బుక్,యాపిల్ వంటి కంపెనీలు బెంగుళూరును కాదని హైదరాబాద్ మహానగరానికి వచ్చాయని చెప్పారు. టీఎస్ఐపాస్ ద్వారా 12.67లక్షల ఉద్యోగాలను సృష్టించామని తెలిపారు.