తెలంగాణ కోసం ఎన్నో పదవులు త్యాగాలు చేసినం. లేనిపోని ఆరోపణలు చేసి ప్రజలను గందరగోళ పరచొద్దు. అభివృద్ధి కోసమే అప్పులు చేసినం… అవసరమైతే ఇంకా తెస్తాం. 40 ఏండ్లలో ఎస్‌ఎల్‌బీసీ ఇంకా పూర్తి కాలేదు. మేము వచ్చి కాళేశ్వరం కట్టి చూపించినం. 45 లక్షల ఎకరాలను నీళ్లిచ్చి తీరుతం. ఒక పంటతో కాళేశ్వరంపై ఖర్చు తీరుతుంది. దేశంలో ఆర్థిక మాంద్యం ఉంది. వాస్తవంగా మేము పెట్టిన బడ్జెట్ లక్షా 36వేల కోట్లే. మిగితా 10వేల కోట్లు హైదరాబాద్‌లోని భూముల అమ్మకం ద్వారా వచ్చేదు.ఆర్థిక మాంద్యం ఉన్నా సంక్షేమ పథకాలు ఆపేది లేదని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అసెంబ్లీలో తెలిపారు.