తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ సర్కారు మాటలతో కూడిన ప్రచారం చేసే సర్కారు కాదు. మాది చేతల ప్రభుత్వం అని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హారీశ్ రావు అన్నారు. అసెంబ్లీలో జరుగుతున్న బడ్జెట్ సమావేశాల్లో భాగంగా మంత్రి హారీష్ రావు మాట్లాడుతూ” ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఐఆర్ ,పీఆర్సీ వంటి అంశాలు ముఖ్యమంత్రి కేసీఆర్ పరిశీలనలో ఉన్నాయి.వాటిపై త్వరలోనే ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకుంటారని”అన్నారు. రాష్ట్రంలోని సాధారణ పరిపాలన విభాగం పద్దుపై మంత్రి తన్నీరు హారీష్ రావు మాట్లాడుతూ” దేశంలో ఏ రాష్ట్రం లో లేనివిధంగా జర్నలిస్టులు, న్యాయవాదులు, బ్రాహ్మణ సంక్షేమ పరిషత్తులకు ప్రత్యేకనిధి ఏర్పాటుచేసిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుంది. ఇప్పటివరకు 1,49,382 ప్రభుత్వోద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్లు విడుదలయ్యాయి.. 1,17,714 పోస్టుల భర్తీ ప్రక్రియ ముగిసింది.మిగిలిన పోస్టుల భర్తీ ప్రక్రియ పురోగతిలో ఉన్నదని చెప్పారు.
