తెలంగాణ రాష్ట్రంలో నాలుగు ఎంపీ స్థానాలను గెలుపొంది మంచి ఊపులో ఉన్న బీజేపీ పార్టీలోకి వలసలు మొదలయ్యాయి. ఈ క్రమంలో బాల్కొండ అసెంబ్లీ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే అన్నపూర్ణమ్మ కమలం కండవా కప్పుకోవడానికి రెడీ అయ్యారు. రాష్ట్ర బీజేపీ శాఖ అధ్యక్షుడు అయిన లక్ష్మణ్ ,ఎంపీ ధర్మపురి అరవింద్ హైదరాబాద్ మహానగరంలోని మాజీ ఎమ్మెల్తే అన్నపూర్ణమ్మను కల్సి బీజేపీలోకి చేరాలని ఆహ్వానించారు. ఇందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన అన్నపూర్ణమ్మ వచ్చే నెల పద్దెనిమిదో తారీఖున బీజేపీ పార్టీలో చేరనున్నారు.