తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో ద్రవ్య వినిమయ బిల్లుపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమాధానం ఇస్తున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ”
తెలంగాణ కోసం ఎన్నో పదవులు త్యాగాలు చేసినం.
లేనిపోని ఆరోపణలు చేసి ప్రజలను గందరగోళ పరచొద్దు.
అభివృద్ధి కోసమే అప్పులు చేసినం…
అవసరమైతే ఇంకా తెస్తాం.
….
40 ఏండ్లలో ఎస్ఎల్బీసీ ఇంకా పూర్తి కాలేదు.
మేము వచ్చి కాళేశ్వరం కట్టి చూపించినం. 45 లక్షల ఎకరాలను నీళ్లిచ్చిస్తాం.
ఒక పంటతో కాళేశ్వరంపై ఖర్చు తీరుతుంది.
..
దేశంలో ఆర్థిక మాంద్యం ఉంది. వాస్తవంగా మేము పెట్టిన బడ్జెట్ లక్షా 36వేల కోట్లే.
మిగితా 10వేల కోట్లు హైదరాబాద్లోని భూముల అమ్మకం ద్వారా వచ్చేదు.
ఆర్థిక మాంద్యం ఉన్నా సంక్షేమ పథకాలు ఆపేది లేదు.
…
పక్క రాష్ర్టానికి చెందిన రాజ్యసభ సభ్యులను బీజేపీలో కలుపుకున్నారు. గోవాలో 10 మంది కాంగ్రెస్ సభ్యులు బీజేపీలో విలీనమయ్యారు.
రాజస్థాన్లో బీఎస్పీ సభ్యులను కాంగ్రెస్ చేర్చుకుంది.
….
టీఆర్ఎస్లో చేరిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వందకు వందశాతం రాజ్యాంగబద్దంగానే టీఆర్ఎస్లో చేరారు.
వాళ్లను మేము పార్టీలో చేర్చుకోలేదు. వాళ్లే టీఆర్ఎస్లో విలీనమైనారు అని తెలిపారు.
