వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో ఎన్నడూ లేని విధంగా 1.26 లక్షల గ్రామవాలంటీర్లు, గ్రామ సచివాలయ ఉద్యోగాలను భర్తీ చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు పూర్తిగా పారదర్శకంగా, ఎక్కడా అవకతవకలకు ఆస్కారం లేకుండా.. పకడ్బందీగా పరీక్షలు నిర్వహించి..ఫలితాలు విడుదల చేసింది. అయితే గత ఐదేళ్లలో యువతకు ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేని బాబు ఇప్పుడు విషం కక్కుతున్నాడు. .ప్రభుత్వం ఒకేసారి లక్ష పాతిక వేలకు పైగా ఉద్యోగాలు ఇవ్వడాన్ని జీర్ణించుకోలేకపోయిన ఎల్లోమీడియా బాబు ఆదేశాల మేరకు రంగంలోకి దిగి..పేపర్‌లీక్ అయిందంటూ… లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో జగన్ సర్కార్ చెలగాటం ఆడుతుందంటూ,,, అసత్య కథనాలు ప్రసారం చేస్తోంది. ఏపీపీఎస్సీలో పని చేస్తున్న సిబ్బందికే ట్యాప్ ర్యాంకులు వచ్చాయంటూ పచ్చ కథనాలు వండి వారుస్తూ..విద్యార్థులను రెచ్చగొడుతోంది. చంద్రబాబు, ఎల్లోమీడియా ప్రచారంపై మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ తీవ్రంగా స్పందించారు. గడిచిన ఐదేళ్లలో చంద్రబాబు ఒక్క ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వకపోగా, అధికారంలోకొచ్చిన వంద రోజుల్లోనే వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం 1.26 లక్షల ఉద్యోగాలు ఇవ్వడం చూసి జీర్ణించుకోలేక పేపర్ లీక్ అంటూ దరిద్రమైన ప్రచారం మొదలుపెట్టడం.. సిగ్గుమాలిన చర్య అంటూ మంత్రి అనిల్‌కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, రాజకీయ నేతల జోక్యం లేకుండా పూర్తి పారదర్శకంగా గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగాల పరీక్షలను తమ ప్రభుత్వం నిర్వహించిందన్నారు.. చంద్రబాబుకు వయస్సు పెరిగినా వంకర బుద్ధి మాత్రం పోలేదని, ప్రభుత్వంపై నిందలు మోపి రాజకీయం చేయాలని చూస్తున్నాడంటూ..మంత్రి అనిల్‌కుమార్ మండిపడ్డారు. అసలు సచివాలయ ఉద్యోగాల్లో కానీ, వాలంటీర్ల ఉద్యోగాల కల్పనలో కానీ చిన్న అవినీతి జరిగిందని నిరూపించగలరా అంటూ బాబుకు, ఎల్లోమీడియాకు మంత్రి సవాల్ చేశారు.
వాస్తవానికి బాబు వస్తే జాబు వస్తుందని ప్రచారం చేసి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఆ తర్వాత ఐదేళ్లలో ఒక్క జాబ్ కూడా రాలేదు. జాబ్ రావాలంటే బాబు పోవాలి అని…వైసీపీతో పాటు యువత పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకేసారి లక్షా పాతిక వేలకు పైగా ఉద్యోగాలను ప్రభుత్వం ఒకేసారి భర్తీ చేయడాన్ని చంద్రబాబుతో సహా ఎల్లోమీడియా ఛానళ్లు తట్టుకోలేకపోతున్నాయి. దీనికి తోడు ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకు ఎల్లోమీడియా ఛానళ్లతో కలిసి చేసిన రాజధాని తరలింపు డ్రామా, పల్నాడు పునరావాస కేంద్రాల డ్రామా, కోడెల ఆత్మహత్య పేరుతో ఆడిన డ్రామాలు అట్టర్‌ఫ్లాప్ అయ్యాయి. దీంతో ఇప్పుడు పరీక్షలు లీకేజీ అంటూ డ్రామాలు మొదలుపెట్టారన్న విషయం ప్రతి ఒక్కరికి అర్థమవుతోంది. ఒకవేళ పేపర్ లీకేజీ అయితే పరీక్షల సమయంలోనే బయటపడేది…లేకుంటే పరీక్షలు అయ్యాక కొద్ది రోజులకే బయటపడతాయి. కానీ తీరా ఫైనల్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత లీకేజీ అంటూ వార్తలు రావడం..అది ఒక్క ఎల్లోమీడియా ఛానల్స్‌లోనే రావడం గమనార్హం. లీకేజీకి బాధ్యులు అంటూ కనీసం పేరు కూడా చెప్పడం లేదు..కానీ ఏపీపీఎస్సీలో కొందరు ఉద్యోగులకే ర్యాంకులు వచ్చాయంటూ..దుష్ప్రచారం చేస్తున్నాయి. ఒక వేళ నిజంగా పేపర్ లీక్ అయితే..అన్ని ప్రధాన ఛానల్స్‌లో రావాలి..కాని అదేంటో ఒక్క ఎల్లోమీడియా ఛానల్స్‌లోనే వస్తున్నాయి. రాష్ట్రంలో ఎల్లోమీడియా కాకుండా తటస్థంగా వ్యవహరించే పత్రికలు, ఛానల్స్ ఉన్నాయి. మరి వాటిలో పేపర్ లీక్ అంటూ వార్తలు రావడం లేదు. దీన్ని బట్టి అర్థమవుతుంది ఏమిటంటే..జగన్ ప్రభుత్వంపై బురద జల్లడానికి, తద్వారా ప్రభుత్వానికి వ్యతిరేకంగా యువతను రెచ్చగొట్టడానికే చంద్రబాబుతో సహా, ఎల్లోమీడియా ఛానళ్లు పనిగట్టుకుని గబ్బు లేపుతున్నాయి. బాబు పోతే జాబు వస్తే ఇంత గబ్బు లేపుతున్న పచ్చమీడియాపై ఏపీ యువత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.