వైసీపీ పాలనపై టీడీపీ మహిళా నేత పంచుమర్తి అనురాధ తనదైన శైలిలో స్పందించారు. ప్రజల్లో తిరిగే ధైర్యం జగన్ కు లేదని, జగన్ మానసిక స్థితిపై సందేహాలు కలుగుతున్నాయని వ్యాఖ్యానించారు. అంతేకాదు జగన్ కు పట్టిన దెయ్యాన్ని వదిలించే రోజు దగ్గర్లోనే ఉందని అన్నారు. ఆంద్రప్రదేశ్ లో నవరత్నాలను వదిలేశారని, అన్ని అంశాల్లో వైసీపీ సర్కారు విఫలమైందని వ్యాఖ్యానించారు. వైసీపీ నేతలు అరిచి గోల చేసినంత మాత్రాన అబద్ధాలు నిజం కావని హితవు పలికారు. ప్రస్తుతం ఆమె చేసిన వాఖ్యలు ఏపీలో హాట్ టాపిక్ గా మారాయి. మరి దీనిపై వైసీపీ నేతలు ఏలా స్పందిస్తారో చూడాలి మరి.
