భారతీయులకు శుభవార్త…మూమూలుగా ఇండియన్స్ విదేశాలకు వెళితే..పాస్‌పోర్ట్ కంపల్సరీ..ముఖ్యంగా విదేశాల్లో చదవాలనుకునే విద్యార్థులకు, కళాకారులకు, వ్యాపారులకు పాస్‌పోర్ట్ రావడం కష్టంగా మారింది. ఒక్క శ్రీలంకకు తప్పా..ఏ దేశానికి వెళ్లాలన్నా పాస్‌పోర్ట్ తప్సనిసరి. అయితే పూర్వం సోవియట్ యూనియన్‌కు చెందిన ఉజ్బెకిస్తాన్ దేశం ఇండియన్స్‌కు, ముఖ్యంగా తెలుగు ప్రజలకు శుభవార్త చెప్పింది. ఇక నుంచి వీసా అవసరం లేకుండా ఉజ్బెకిస్తాన్‌ను సందర్శించే అవకాశాన్ని వచ్చే ఏడాది నుంచి కల్పించనున్నట్టు ఆ దేశ రాయబారి ఫర్హోద్ అర్జీవ్ తెలిపారు. తాజాగా హైదరాబాద్ పర్యటనకు వచ్చిన ఆయన శుక్రవారం జీహెచ్‌ఎంసీ కార్యాలయంలో మేయర్ రామ్మోహన్‌ను కలిసిన సందర్భంగా వీసాపై కీలక ప్రకటన చేశారు. ఈ సందర్భంగా ఫర్హోద్ మాట్లాడుతూ.. భారత్, ఉజ్బెకిస్తాన్‌కు దశాబ్దాలుగా మెరుగైన దౌత్య సంబంధాలున్నాయని, తాస్కెంట్ ఒప్పందమే ఇందుకు నిదర్శనమని తెలిపారు. త్వరలోనే హైదరాబాద్, ఉజ్బెకిస్తాన్‌లోని 2,500 సంవత్సరాల చరిత్ర ఉన్న బోహ్ర నగరాల మధ్య సిస్టర్ సిటీ ఒప్పందం జరుగనుందని చెప్పారు. తద్వారా హైదరాబాద్, బోహ్ర నగరాల మధ్య సాంస్కృతిక, విద్య, వ్యాపార రంగాల్లో సత్సంబంధాల ఏర్పాటుకు మార్గం సుగుమమం అవుతుందని ఉజ్బెకిస్తాన్ రాయబారి తెలిపారు. అంతేకాదు ఇక్కడి చలనచిత్ర పరిశ్రమ అయిన బాలీవుడ్, టాలీవుడ్‌లను ఉజ్బెకిస్తాన్‌కు ఆహ్వానిస్తున్నామని, తమ దేశంలో ఎన్నో ఆకర్షణీయ, చారిత్రక, పర్యాటక కేందాల్రున్నాయని, షూటింగులకు అనుకూలంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని ఉస్మానియా, సెంట్రల్ యూనివర్సిటీలో తమ దేశానికి చెందిన ఎంతో మంది విద్యార్థులు చదువుతున్నారని ఈ సందర్భంగా ఫర్హోద్ గుర్తు చేశారు. ఒక్క టూరిజంలోనే కాకుండా తమ దేశంలో ఫార్మా పరిశ్రమల ఏర్పాటుకు విస్తృత అవకాశాలున్నాయన్నారు. సో..చూశారుగా.సోవియట్ యూనియన్ నుంచి వేరుపడిన తర్వాత కొద్ది కాలంలోనే ఉజ్బెకిస్తాన్ అన్ని రంగాల్లో ప్రగతి సాధిస్తోంది. సో..ఇక నుంచి పాస్‌పోర్ట్ లేని వారు కూడా అలా విమానం ఎక్కేసి..ఉజ్బెకిస్తాన్‌కు వెళ్లి రావచ్చు..ముఖ్యంగా ఉజ్బెకిస్తాన్ ఇస్తాం దేశం. కాబట్టి పాతబస్తీ ప్రజలు వీసా లేకుండా ఉజ్బెకిస్తాన్‌కు వెళ్లి రావచ్చు భలే ఛాన్సు కదా..
Tags ambassidor hyderabad mayor bontu rammohan Meeting telangana travel Uzbekistan without visa