తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆన్ లైన్ సినిమా టికెట్ల విక్రయ విధానం ఇక ముందు కన్పించదా..?. సినిమాలు చూడాలంటే థియేటర్లకెళ్లే టికెట్లు కొని చూడాలా..? అని అంటే అవుననే అంటున్నారు రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.
ఆయన మాట్లాడుతూ” ఆన్ లైన్ సినిమా టికెట్ల విక్రయ విధానానికి త్వరలోనే స్వస్తి చెప్పే ఆలోచన చేస్తే ఎలా ఉంటుందని ఆలోచిస్తున్నాము. సర్కారే నేరుగా సినిమా టికెట్లను విక్రయిస్తే అందరికీ లాభముంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే ఈ కొత్త విధానాల వలన నిర్మాతలకు,పంపిణీదారులకు లాభముంటుందని తెలిపారు.