ఉండవల్లిలో కృష్ణా నది కరకట్టపై నిర్మించిన చంద్రబాబు అక్రమ నివాసం కూల్చివేతకు రంగం సిద్ధం అయింది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అక్రమ కట్టడాలపై సీరియస్‌గా వ్యవహరిస్తోంది. ఇప్పటికే చంద్రబాబు నివాసంలో అక్రమంగా నిర్మించిన ప్రజావేదికను ప్రభుత్వం కూల్చివేయించింది. ఇటీవల కృష్ణా నదికి వచ్చిన వరదల నేపథ్యంలో కరకట్ట మీద ఉన్న అనేక భవనాలతో పాటు చంద్రబాబు అక్రమ నివాసం కూడా మునిగిపోయింది. దీంతో వరద ముంపు భయంతో చంద్రబాబు కుటుంబంతో సహా ఆ ఇల్లు ఖాళీ చేసి హైదరాబాద్‌కు వెళ్లిపోయాడు. అయితే ప్రభుత్వమే కావాలని బ్యారేజీకి పడవలు అడ్డుపెట్టి వరదను మళ్లించి తమ ఇంటిని ముంచేసిందంటూ చంద్రబాబు, లోకేష్‌లు సాగించిన ప్రచారం హాస్యాస్పదంగా మారింది. చంద్రబాబు అక్రమ నివాసం వరదముంపుకు గురైన సందర్భంగా అధికారులు రంగంలోకి దిగారు. నదీ నిబంధనలకు విరుద్దంగా కట్టిన ఆ ఇంటిని ఖాళీ చేయాలంటూ నోటీసులు కూడా జారీ చేశారు.. ఈ మేరకు చంద్రబాబు ఇంటికి నోటీసులు కూడా అంటించారు.ఇక ప్రభుత్వం వరద బాధితుల సహాయార్థం కరకట్టపై డ్రోన్ కెమెరాలు వినియోగించడాన్ని కూడా చంద్రబాబు రాజకీయం చేశాడు. కావాలనే ప్రభుత్వం తన ఇంటి చుట్టూ డ్రోన్ కెమెరాలతో నిఘా పెట్టిందని, తన ప్రాణాలకు భద్రత లేదని.. చంద్రబాబు గగ్గోలు పెట్టాడు. టీడీపీ నేతలు డ్రోన్ కెమెరాలు అడ్డుపెట్టుకుని ప్రభుత్వంపై బురద జల్లేందుకు ప్రయత్నించారు.
ఇంత జరిగినా చంద్రబాబు తన అక్రమ నివాసాన్ని ఖాళీ చేయలేదు. ఈ నేపథ్యంలో సీఆర్‌డీఏ అధికారులు మళ్లీ రంగంలోకి దిగారు. మరోసారి చంద్రబాబు ఇంటికి నోటీసులు అతికించారు. వారంలోగా ఇంటికి కూల్చేయాలని, లేని పక్షంలో తామే కూల్చేస్తామని తాజాగా అతికించిన ఆ నోటీసుల్లో స్పష్టం చేశారు. గతంలోనే ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మించిన అక్రమ కట్టడాన్ని ఎందుకు తొలగించకూడదో చెప్పాలంటూ నోటీసులు జారీ చేయగా…చంద్రబాబు అన్ని అనుమతులు ఉన్నాయని, చూపిస్తామని సమాధానం ఇచ్చాడని..కానీ ఇంత వరకు ఎలాంటి అనుమతి పత్రాలు చూయించలేదని సీఆర్‌డీఏ అధికారులు తెలిపారు. దీంతో మరోసారి నోటీసులు జారీ చేసి, వారంలోగా అక్రమ ఇంటిని కూల్చివేయాలని, లేకుంటే తామే కూల్చివేస్తామంటూ అధికారులు నోటీసులు జారీ చేశారు. అయితే అందరిలా వినే రకం కాదు చంద్రబాబు. కచ్చితంగా దీన్ని కూడా రాజకీయం చేస్తాడు…ఈ ప్రభుత్వం నన్ను రాజధానిలో ఉండకుండా కుట్ర చేస్తోందంటూ రచ్చ చేయడం ఖాయం..మరోవారం రోజుల్లో సీఆర్‌డీఏ అధికారులు ఇచ్చిన నోటీస్ ప్రకారం చంద్రబాబు ఇంటిని కూల్చివేయడం ఖాయం..ఇదే అదనుగా కావాల్సినంత సింపతీ కొల్లగొట్టడానికి కరకట్టపై కొంప డ్రామాకు చంద్రబాబు స్కీన్ల్‌పై, డైరెక్షన్ వహించడం గ్యారంటీగా కనిపిస్తోంది.