మున్సిపల్ విభాగానికి చెందిన ఇంజనీర్ అనే ఉద్యోగి ఉంటున్న రూంలోకి ఒక అమ్మాయిని పంపి.. అక్కడ జరిగిన సంఘటనలను వీడియోలో చిత్రీకరించి బ్లాక్ మెయిల్ చేసిన ఉదాంతం వెలుగులోకి వచ్చింది. ఇండోర్ పోలీసులు గుట్టు రట్టు చేసిన ఇండోర్ మున్సిపల్ కార్యాలయంలో ఈ సంఘటనలో హనీట్రాప్ రాకెట్ ఉదాంతం ప్రస్తుతం సంచలనం సృష్టిస్తుంది.
ఇదే నెల పదిహేడో తారీఖున ఆ కార్పోరేషన్లో ఇంజనీరుగా పనిచేస్తోన్న హర్భజన్ సింగ్ తనను బ్లాక్ మెయిల్ చేస్తుందని ఆర్తి దయాళ్ అనే మహిళపై ఇండోర్ నగరంలోని పలాసియా పోలీసులకు పిర్యాదు చేశారు. పిర్యాదు అందుకున్న పోలీసులు రంగంలోకి హానీ ట్రాప్ రాకెట్ బాగోతాన్ని వెలుగులోకి తెచ్చారు.
మోనికా యాదవ్ అనే పద్దెనిమిదేళ్ల కాలేజీ అమ్మాయి తనకు నౌకరి ఇప్పించేందుకు సహాకరించాలని కోరుతూ హర్భజన్ ను కలిసింది. అనంతరం అదే గదిలోకి ఆ అమ్మాయిని పంపించి ఆమెతో అతడు చేసిన కార్యాన్ని రహాస్య కెమెరాతో ఆర్తి దయాళ్ వీడీయో తీసి.. అతనికి దాన్ని చూపించి మూడు కోట్లివ్వాలని డిమాండ్ చేసింది.