చిత్తూరు మాజీ ఎంపీ, టీడీపీ నేత ఎన్. శివప్రసాద్ ఇక లేరు చెన్నైలో చికిత్స పొందుతూ..సరిగ్గా 2.07 నిమిషాలకు ఎన్. శివ ప్రసాద్ మరణించారు. గత కొద్ది రోజులుగా మూత్ర పిండ సంబధిత వ్యాధిలో బాధపడుతున్న శివప్రసాద్ ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో ఆయన్ని కుటుంబ సభ్యులు చెన్నైలోని అపోలో ఆసుపత్రికి తరలించారు. నిన్న ఆయన ఆరోగ్య పరిస్థితి మరింతగా విషమించడంతో డాక్టర్లు వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఈ రోజు తుది శ్వాస విడిచారు. ఆయన మృతికి సీఎం జగన్ సంతాపం తెలిపారు. శివప్రసాద్ కుటుంబానికి జగన్ ప్రగాఢసానుభూతి తెలిపారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని జగన్ గుర్తుచేసుకున్నారు. శివప్రసాద్ మృతికి పలువురు ప్రముఖులు సానుభూతి వ్యక్తం చేశారు.
