తెలంగాణ రాష్ట్రంలోని నల్లగొండ పార్లమెంట్ నియోజకవర్గ ఎంపీ,టీపీసీసీ అధ్యక్షుడు ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యే పదవీకి రాజీనామా చేయడంతో హుజూర్ నగర్ కు ఉప ఎన్నిక అనివార్యమైంది.
దీంతో అసెంబ్లీ స్థానికి వచ్చే నెల అక్టోబర్ 21న ఉప ఎన్నిక జరగనున్నదని కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ సునీల్ ఆరోరా తెలిపారు. ఆయన ఇంకా మాట్లాడుతూ”ఈ నెల ఇరవై మూడున దీనికి సంబంధించిన ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది.
ఎన్నికల్లో బరిలోకి దిగేవారు నామినేషన్ల దాఖలుకు చివరి రోజు సెప్టెంబర్ ముప్పై. నామినేషన్లు ఉపసంహారణకు అఖరి గడవు అక్టోబర్ 3. పోలింగ్ అక్టోబర్ 21. ఎన్నికల ఫలితాలు వెలువడేది అక్టోబర్ 24 అని తెలిపారు.