వైయస్ఆర్‌సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీ సీఎం జగన్ పాదయాత్రలో ఇచ్చిన హామీలన్నీ ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్న సంగతి తెలిసిందే..వైయస్ఆర్ రైతు భరోసా, అమ్మఒడి, ప్రతి పేదవాడికి నాణ్యమైన బియ్యం, ఆశావర్కర్లకు వేతనాల పెంపు..ఇలా 100 రోజుల్లోనే 100 కు పైగా ప్రజా సంక్షేమ నిర్ణయాలు తీసుకుని దేశంలోనే 3 వ అత్యుత్తమ ముఖ్యమంత్రిగా నిలిచారు. తాజాగా పాదయాత్రలో ఆటో, ట్యాక్సీ డ్రైవర్లకు రిపేర్ల నిమిత్తం, ప్రతి ఏటా రూ. 10 వేలు ఆర్థిక సాయం చేస్తానని ఇచ్చిన హామీ మేరకు రూ. 400 కోట్లు కేటాయిస్తూ సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు రాష్ట్రంలోని ప్రతి ఆటో, ట్యాక్సీ డ్రైవర్లకు ప్రభుత్వం నుంచి ప్రతి ఏటా రూ. 10 వేలు అందనున్నాయి. దీంతో ఆటో, ట్యాక్సీ కార్మికులు హర్షం వ్యక్తం అవుతోంది. మాట తప్పని, మడమ తిప్పని నేత జగన్ అంటూ ఆటో, ట్యాక్సీ డ్రైవర్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
కాగా 2019 సార్వత్రిక ఎన్నికలకు సరిగ్గా మూడునెలల ముందు ఆటో డ్రైవర్లకు జగన్ ఇచ్చిన హామీలను కాపీ కొట్టిన చంద్రబాబు..సేమ్ టు సేమ్ అవే హామీలు గుప్పించాడు. ఆటో డ్రైవర్లు కొందరిని తన ఇంటికి పిలుపించుకుని…ఖాళీ చొక్కా వేసుకుని..స్వయంగా ఆటో నడుపుతూ పబ్లిసిటీ స్టంట్ చేశాడు. మైకు పట్టుకుని ఆటో డ్రైవర్లందరికీ నేనే పెద్ద దిక్కు..అంటూ బిల్డప్ ఇచ్చాడు. అంతే కాదు ఆటోలపై థ్యాంక్యూ సీఎం సార్ అని ముందే రాయించుకుని మురిసిపోయాడు. ఇచ్చిన హామీలను నెరవేర్చకముందే ఇలా థ్యాంక్యూ సీఎం సార్ రాయించుకుని పబ్లిసిటీ చేయించుకున్న చంద్రబాబుపై అప్పట్లోనే విమర్శలు వచ్చాయి. థ్యాంక్యూ సీఎం సార్ అంటూ సోషల్ మీడియాలో చంద్రబాబును ఎద్దేవా చేస్తూ నెట్‌జన్లు ఫుల్లుగా సెటైర్లు వేశారు. ఈ విషయంపైనే వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా స్పందించారు. చంద్రబాబు ఖాళీ చొక్కా వేసుకుని, ఆటోలో నిలబడి మాట్లాడుతున్న ఫోటోను, పాదయాత్రలో ఆటో డ్రైవర్ల చొక్కా తొడుక్కుని వాళ్లతో చేయి చేయి కలిపిన జగన్ ఫోటోను కలిపి ఓ పోస్ట్ పెట్టారు. చంద్రబాబు ఫోటోపై ఎన్నికలకు ముందు ఆటో డ్రైవర్లకు హామీలు ఇచ్చి థ్యాంక్యూ సీఎం సార్ అని రాయించుకున్న నటుడు..మరోవైపు జగన్ ఫోటో దగ్గర ఎన్నికలైన 3 నెలలకే ఆటో డ్రైవర్లకు 400 కోట్లు ఇచ్చి..హామీని నిలబెట్టుకున్న నాయకుడు అంటూ కామెంట్ పెట్టారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సరిగ్గా ఎన్నికలకు ముందు హామీలు ఇచ్చి, వాటిని నెరవేర్చకముందే థ్యాంక్యూ సీఎం సార్ అని డబ్బా కొట్టించుకోవడం కాదు బాబు…ఇచ్చిన హామీని నిలబెట్టుకునే నాయకుడు అంటే జగన్‌లా ఉండాలంటూ నెట్‌జన్లు చంద్రబాబుపై సెటైర్లు వేస్తున్నారు. మొత్తంగా చంద్రబాబు పబ్లిసిటీ పిచ్చిపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా జబర్దస్త్ పంచ్ వేశారు.