వైసీపీ మహిళా ఎమ్మెల్యే రూపొందించిన ఓ వీడియోపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. వైసీపీ శింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి ప్రతి క్షణం ప్రజలకు అందుబాటులో ఉంటూ..ప్రజల సమస్యలను పరిష్కరిస్తూ మంచి పేరు తెచ్చుకుంటున్నారు. తాజాగా నియోజకవర్గంలో తరచుగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాలను చూసి ఎమ్మెల్యే పద్మావతి చలించిపోయారు. ఈ మేరకు రోడ్డు ప్రమాదాలపై, పాటించాల్సిన భద్రతా నియమాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు స్వయంగా రంగంలోకి దిగారు. రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు తానే స్వయంగా ఒక వీడియో చేసి…సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేస్తున్నారు. ఆ వీడియోలో శింగనమల నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యే పద్మావతి ఇచ్చిన పిలుపు…ఆమె మాటల్లోనే విందాం.
అందరికీ నమస్కారం..!నేను మీ ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి. మన శింగనమల నియోజకవర్గంలో యాక్సిడెంట్ జరిగే ప్రదేశాలు ఎక్కడైనా మీరు ఐడెంటిఫై చేస్తే..మాకు తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. ముఖ్యంగా యాక్సిడెంట్ అయి కుటుంబంలో ఒక సభ్యుడిని కోల్పోతే..ఆ కుటుంబం ఎంత తల్లడిల్లిపోతుందో..మనం కొన్నేళ్లుగా చూస్తేనే ఉన్నాం. యాక్సిడెంట్ జరగకుండా చర్యలు తీసుకోవడానికి మొట్టమొదటి ప్రయత్నంగా.. మన నియోజకవర్గ పరిధిలోని, మీ గ్రామంలోకాని, ఎక్కడైనా కానీ ఎక్కువగా ప్రమాదాలు జరిగే ప్రాంతాలను గుర్తించి, మాకు తెలియపర్చవలసిందిగా టోల్‌ఫ్రీ నంబర్స్ ఇస్తున్నాం. 9121913939 లేదా 9121914949.. ముందు ముందు ఎటువంటి ప్రమాదాలు గురి కాకుండా..చూసుకోవడానికి మొదటి ప్రయత్నం మొదలుపెడుతున్నాం. మీరు ఎక్కడైనా కాని… ప్రమాదం జరిగే అవకాశం ఉన్న మలుపులు, కల్వర్టులు, వంతెనలు, రోడ్లు, రిపేర్ జరిగే ప్రాంతాలు, క్రాసింగ్‌లు వంటి రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రాంతాలను గుర్తిస్తే..తప్పకుండా మాకు తెలియపర్చవలసిందిగా కోరుతున్నాం. రోడ్డు ప్రమాదాలు జరగకుండా తీసుకుంటున్న ఈ చర్యల్లో నియోజకవర్గ ప్రజలు భాగస్వాములు కావాలని కోరుకుంటూ..సెలవు తీసుకుంటున్నాను.. మీ జొన్నలగడ్డ పద్మావతి.
రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పించేందుకు వైసీపీ మహిళా ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి రూపొందించిన ఈ వీడియోపై ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నిజంగా రోడ్డు ప్రమాదాల్లో
కుటుంబ సభ్యులు ఎవరైనా మరణిస్తే..ఆ కుటుంబం బాధ వర్ణణాతీతం. ప్రతి రోజూ రోడ్డు ప్రమాదాల వల్ల కొన్ని వందల కుటుంబాలు రోడ్డునపడుతున్నాయి. ఆయా కుటుంబ సభ్యుల జీవితాలు ఒక్కసారిగా ఛిన్నాభిన్నం అవుతున్నాయి. నిజంగా రోడ్డు ప్రమాదాలపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత అధికారులతో పాటు, ప్రజాప్రతినిధులకు ఉంది. ఈ మేరకు జొన్నలగడ్డ పద్మావతి స్వయంగా ప్రజలకు అవగాహన కల్పించడం నిజంగా అభినందనీయం. తమఎమ్మెల్యే చేస్తున్న ఈ మంచి పని పట్ల శింగనమల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ వీడియోపై నెట్‌జన్లు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. మీ మంచి మనసుకు హ్యాట్సాఫ్ అమ్మా..మీరు నిజమైన ప్రజా నాయకురాలు అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.