ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి తన మార్క్ పరిపాలన చూపించారు. సాధారణంగా దేశంలో ఏ ముఖ్యమంత్రి అయిన ఉద్యోగాల విషయంలో ఆచి తూచి అడుగు వేస్తారు. గత ఐదేళ్ల పాలనలో చంద్రబాబు నాయుడు పట్టుమని ఒక పదివేలు జాబులు తీసిన పాపాన పోలేదు. చాలా వాటికి నోటిఫికేషన్ కి కూడా ఇవ్వలేదు ఇచ్చిన నోటిఫికేషన్ కూడా ఏ విధమైన న్యాయం చేయలేకపోయారు. అయితే జగన్ అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే ఇచ్చిన మాట ప్రకారం పాదయాత్రలో చెప్పిన విధంగా నాలుగు లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేశారు విడుదల చేయడమే కాదు పరీక్షలు నిర్వహించి వారికి ఉద్యోగాలు ఇస్తున్నారు. అయితే ఈ విషయంలో మరొకసారి ప్రభుత్వం ముందడుగు వేసింది. మిగిలిన పోస్టులకు మరొకసారి నోటిఫికేషన్ విడుదల చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో మొట్టమొదటిసారిగా నిర్వహించిన పరీక్షల్లో పాస్ కాలేకపోయిన వారు మరియు కొద్ది శాతం మార్కులు తేడాతో జాబ్ పొందలేకపోయిన వారికి మరో అవకాశం లభించినట్లయింది. గ్రామ సచివాలయం సెక్రటరీ పోస్టులకు నోటిఫికేషన్ తాజాగా విడుదల కానుందని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసిం.సీఎం నిర్ణయం పట్ల విద్యార్ధులు హర్షం వ్యక్తం చేస్తున్నారు
