ఆంధ్రప్రదేశ్ యువతలో నూతనోత్తేజం..విజయోత్సాహంతో వేల కుటుంబాల్లో వెల్లివిరిసిన సంతోషం..గురువారం గ్రామ/వార్డు సచివాలయ పరీక్షల ఫలితాలను ప్రభుత్వం విడుదల చేయడం..అక్టోబర్ 2న విధుల్లో చేరే అవకాశం లభించడంతో విజయం సాధించిన అభ్యర్థుల్లో ఆనందం అంబరాన్ని తాకింది. జగన్ సర్కారు పరీక్షలు నిర్వహించిన పది రోజుల్లోనే ఫలితాలను విడుదల చేశారు. మొత్తం 40 రోజుల్లో సచివాలయ ఉద్యోగాల నియమాక ప్రక్రియను పూర్తి చేయనుండడం సరికొత్త రికార్డు సృష్టించనుంది. అయితే గ్రామ సచివాలయ ఫలితాలలో డిజిటల్ అసిస్టెంట్ కేటగిరీలో రాష్ట్రంలో ప్రధమ స్థానం దక్కించుకున్నా యువతి తూర్పుగోదావరి జిల్లా యూ కొత్తపల్లి మండలం నాగులాపల్లికి చెందిన చింతపల్లి రమ్య లాలీష. ఈమె విజయం సాదించడంతో వారి కుటుంభ సభ్యలు ఆనందం మాటల్లో చెప్పలేనిది.. ఎందుకంటే తండ్రి సాధారణ సైకిల్ రిపేర్ కార్మికుడు. సచివాలయ పరీక్షల ఫలితాల్లో రాష్ట్రంలో ప్రధమ స్థానం రావడంతో రమ్యను పలువురు అభినందిస్తున్నారు.