కేంద్ర ప్రభుత్వం దేశంలోని కార్పొరేట్ కంపెనీలకు ట్యాక్స్ తగ్గిస్తూ తీసుకున్న నిర్ణయంతో స్టాక్ భారీ లాభాలతో పరుగులు పెట్టాయి. దాదాపు రెండు వేల పాయింట్లకు పైగా లాభంతో సెన్సెక్స్ ట్రేడవుతుంది. నిఫ్టీ ఆరు వందలకు పైగా పాయింట్ల లాభంతో కొనసాగుతుంది. అయితే గత దశాబ్ధ కాలంలో ఎన్నడూ లేని విధంగా నిఫ్టీ పరుగులు పెట్టడం గమనార్హం . ఇక రూపాయి విలువకొస్తే మారకం విలువ రూ.71.06వద్ద కొనసాగుతుంది.