మనలో చాలా మందికి లంచ్ కాగానే ఓ అర గంట కునుకు తీయడం అలవాటుగా మారింది. మధ్యాహ్నం సుష్టుగా భోజనం చేసి, అలా నడుంవాలిస్తే ఎంత హాయిగా నిద్రపడుతుందో..ముఖ్యంగా గృహిణులు, మధ్యవయస్కులు, వృద్ధులు పగటి పూట కాసేపు పడుకుని రిలాక్స్ అవుతారు.తిరిగి లేచి ఓ కప్పు టీ, లేదా కాఫీ తాగి..రోజువారీ పనుల్లో పడిపోతారు. కొందరు పదినిమిషాలు ఓ కునుకు తీసి లేస్తారు. మరి కొందరు కనీసం 2 గంటలైనా పడుకుంటారు. అలా ఎక్కువసేపు పగటిపూట పడుకోవడం ఆరోగ్యానికి మంచిది కాదంటున్నారు శాస్త్రవేత్తలు…పగటి పూట ఎక్కువగా నిద్రపోవడం వల్ల అల్జీమర్స్ వ్యాధి వస్తుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.
తాజాగా పగటి పూట నిద్రపోయే వారికి అల్జీమర్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటూ.. అమెరికన్ శాస్త్రవేత్తలు చేసిన ఓ పరిశోధనలో తేలింది. పరిశోధనలో భాగంగా మనల్ని నిద్రపోకుండా ఉంచే మెదడులోని భాగాలను శాస్త్రవేత్తలు పరిశీలించారు. అయితే పగలు ఎక్కువగా నిద్రపోయే వారిలో ప్రొటీన్లు మెదడుకు చేరడం లేదని గుర్తించారు. ఫలితంగా మనల్ని మెలకువతో ఉంచే నాడీకణాలు చనిపోతున్నట్టు తేలిందని, అంతిమంగా ఇది అల్జీమర్స్‌కు దారి తీస్తోందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. చూశారుగా పగటి పూట నిద్రపోయే వాళ్లు వారు తీసుకునే ఆహారంలోని ప్రోటీన్లు మెదడుకు చేరకపోవడం వల్ల మెలుకువగా ఉంచే నాడీకణాలు చనిపోతాయి. తద్వారా అతి ప్రమాదకరమైన అల్జీమర్స్ వ్యాధి వస్తోంది. అందుకే బీ కేర్‌ఫుల్… పగటి పూట పడుకోవడం మానేయండి..అప్పుడే మీ బ్రెయిన్‌లోని నాడీ కణాలు యాక్టివ్‌గా ఉంటాయి. అల్జీమర్స్ వచ్చే ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చు. ఓకేనా..