మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, పూజా హెగ్డే జంటగా నటిస్తున్న చిత్రం వాల్మీకి, ఈ చిత్రానికి గాను హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. మరికొన్ని గంటల్లో చిత్రం మీ ముందుకు రానుంది. రాయలసీమలో కొన్ని అభ్యంతరాలు వ్యక్తం అవ్వడం వల్ల సినిమా రిలీజ్ అయ్యే ఒక్కరోజు ముందు చిత్ర యూనిట్ కు హై కోర్ట్ షాక్ ఇచ్చింది.టైటిల్ విషయంలో చిత్ర యూనిట్ క్లారిటీ ఇచ్చినప్పటికీ ఈ విషయం పై కోర్ట్ వారికి వ్యతిరేఖంగా తీర్పు ఇవ్వక తప్పలేదు. దాంతో టైటిల్ మార్చాల్సి వచ్చింది. ఇప్పుడు వాల్మీకికి బదులుగా “గడ్డలకొండ గణేష్” అనే టైటిల్ పెట్టారు. మరి ఈ టైటిల్ తో ప్రేక్షకులు సంతోషంగా ఉన్నారంటారా. ఈ కారణంగా సినిమా కు ఏదైన ఎఫెక్ట్ రానుందా అనేది తెలియాలంటే మరికొన్ని గంటలు వేచి చూడాల్సిందే.
