ఏపీ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రామ సచివాలయం భర్తీ కోసం నిర్వహించిన పరీక్షల్లో అవకతవకలు జరిగాయంటూ పలు ఎల్లో మీడియా చానళ్లు తెలుగుదేశం పార్టీకి చెందిన పలువురు నాయకులు ఆరోపణలు ఉన్న విషయం తెలిసిందే. సదరు పత్రిక అయితే ఏకంగా పేపర్ కొట్టు ఉద్యోగం పట్ల అనే శీర్షికతో గ్రామ సచివాలయ పరీక్షల్లో అవకతవకలు జరిగాయని వార్తను ప్రచురించింది. దీన్ని టిడిపి సోషల్ మీడియా విపరీతంగా ప్రచారం చేస్తున్నారు . అయితే ఈ వార్తలు పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి ఇ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తీవ్రంగా ఖండించారు భారత దేశంలో ఎన్నడూలేని విధంగా అత్యంత పారదర్శకంగా ఈ పరీక్షలు నిర్వహించామని ఎలాంటి అవకతవకలు లేవన్నారు. కనీసం ఎక్కడ ఒక్క విద్యార్థి అయినా దీనిపై ఫిర్యాదు చేశారని ప్రశ్నించారు . ముఖ్యంగా కావాలనే జగన్ పై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు మరోవైపు ఈ పరీక్షలకు సంబంధించి డిస్ క్వాలిఫై అయిన వారికి ఉద్యోగాలు ఎక్కువగా ఉండడం వల్ల మరికొద్ది రోజుల్లో నోటిఫికేషన్ విడుదల చేస్తామని ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇలాంటి విమర్శలు చేయడం ఏమాత్రం తగదని ఎటువంటి పార్టీలు కులాలు మతాలు ప్రాంతాలు బేధం లేకుండా అందరికీ సమానంగా ఉద్యోగాలు కల్పించడానికి సీఎం జగన్ అధ్యక్షతన అధికారులు సమన్వయంతో పని చేశారంటూ పెద్దిరెడ్డి వివరించారు ఇప్పటికైనా గ్రామ సచివాలయ పరీక్షల విషయంలో చేస్తున్న తప్పుడు ప్రచారాలు మానుకోవాలని హితవు పలికారు