తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న సంగతి విదితమే. ఈ రోజు ఉదయం మొదలైన బడ్జెట్ సమావేశాల్లో అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఆలేరు నియోజకవర్గ ఎమ్మెల్యే గొంగిడి సునీత మాట్లాడుతూ అసెంబ్లీలో కంటతడపెట్టారు.
ఆమె మాట్లాడుతూ” తన తండ్రి జ్ఞాపకం తెచ్చుకుని .. తన తండ్రి డయాలసిస్ రోగి కావడంతోనే ఆర్థికంగా తాము చితికిపోయామన్నారు. డయాలసిస్ రోగులు,వారి కుటుంబ సభ్యులకు కూడా ప్రభుత్వం పెన్షన్ ఇచ్చి ఆదుకోవాలని “ఆమె ప్రభుత్వానికి సూచించారు.
ఎమ్మెల్యే సునీత విజ్ఞప్తిపై స్పందించిన మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడుతూ పెన్షన్ల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతామని” తెలిపారు.