హరీశ్ శంకర్ దర్శకత్వంలో వాల్మీకి (గద్దలకొండ గణేష్) మూవీ. 14 రీల్స్ ప్లస్ పతాకంపై రామ్ ఆచంట, గోపీ ఆచంట ఈ చిత్రాన్ని నిర్మించారు. చిత్రంలో వరుణ్ తేజ్ హీరోగా నటించగా, ఆయన సరసన పూజా హెగ్డే హీరోయిన్గా నటించింది. వాల్మీకి సినిమా టైటిల్ ‘గద్దలకొండ గణేష్’గా మారిన సంగతి తెలిసిందే. ఈ సినిమా పేరుపై పలు వాల్మీకి సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేయగా, మరికొందరు మాత్రం ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో కోర్టు ఆదేశాల నేపథ్యంలో నిర్మాణ సంస్థ ‘14 రీల్స్’ సినిమా పేరును గద్దలకొండ గణేష్ గా మార్చేసింది.
రాష్ట్ర వ్యాప్తంగా ఈ సినిమాపై వివాదం జరుగుతుంది. తాజాగా అందిన సమచారం నేడు కర్నూలు జిల్లాలో ‘గద్దలకొండ గణేష్’ సినిమా రిలీజ్ ను కలెక్టర్ నిలిపివేశారని తెలుస్తుంది. ఏపీ హైకోర్టు నుంచి తమకు అధికారిక ఆదేశాలు ఇంకా అందలేదనీ, అందుకే సినిమాను ప్రదర్శించడం లేదని తెలిపారంట. దీంతో కర్నూలులో ఈ సినిమా ప్రదర్శన ఎప్పుడు ప్రారంభం అవుతుందన్న విషయమై అస్పష్టత నెలకొంది.