టాలీవుడ్ లో సినిమాలు చేస్తూ తెలుగు ఇండస్ట్రీ కీర్తిని దేశవ్యాప్తంగా చాటిన డైరెక్టర్ ఎవరూ అంటే వెంటనే ఎవరికైనా గుర్తొచ్చేది రాజమౌళి నే. ఇతడికి ఉన్న క్రేజ్ ఇండస్ట్రీ లో ఏ డైరెక్టర్ కు ఉండదు. తన తెలివితేటలతో ప్రతీ హీరోని టాప్ లో ఉంచాడు. ఇక ప్రస్తుతం ఎన్టీఆర్, రామ్ చరణ్ ను హీరోలుగా గా పెట్టి ‘ఆర్ ఆర్ ఆర్’ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నాడు. ఈ చిత్రంలో హిందీ భామ ఆలియా భట్ ముఖ్య పాత్రలో నటించనుంది. ఈ సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టనుంది. ఇక అసలు విషయానికి వస్తే ఈ హిందీ భామ వీడియో ఒకటి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. అదేమిటంటే తాను తన బాడీగార్డ్ పై చెయ్యి చేసుకున్న వీడియో. ఆలియా కార్ దిగిన తరువాత కాసేపటికి బాడీగార్డ్ పై చెయ్యి చేసుకుంది. దాంతో నెటీజన్లు ఒక్కసారిగా ఆమెపై ఫైర్ అయ్యారు. అంత అహంకారం ఉండడం మంచింది కాదని, దీనివల్ల ని కెరీర్ కు ముప్పు వస్తుందని అన్నారు. ఈ వీడియో వల్ల రాజమౌళి చిత్రానికి ఏదైనా ఎఫెక్ట్ ఉంటుందేమోననే వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి.