రక్తహీనత గురించి పూర్తి వివరాలు మీకోసం:
మనుష్యునికి రక్తహీనత ఉన్నప్పుడు పూర్తిగా బలహీనులు అవుతారు. ముఖ్యంగా ఆడవారిని ఈ సమస్య ఎక్కువుగా వేదిస్తుంది. దీనికోసం పూర్తిగా తెలుసుకుందాం.
1. రక్తహీనతో ఉన్నవారికి ముఖం పాలిపోయినట్లు , త్వరగా అలసిపోవడం , చిరాకు , కోపం , అసహనం ఎక్కువుగా ఉంటుంది.
2.ఙ్ఞాపకశక్తి తగ్గిపోవటం, ఆయాసం,మతిమరుపు ఎక్కువుగా మరియు నాలుక మంటగా ఉంటుంది.
3.రక్తహీనత ఉండటం వలన మెడనొప్పి , తలనొప్పి వస్తుంది.
4. మద్యపానం , ధూమపానం ఈ సమస్యను మరింతగా ఎక్కువుగా చేస్తాయి .
5.ముఖ్యంగా శరీరంలో ఐరన్ తక్కువగా ఉండడం వల్ల రక్తహీనత ఎక్కువుగా ఉంటుంది.
6.శరీరానికి కావలసిన ఐరన్ లభించాలంటే పండ్లు , పుట్టగొడుగులు , ఆకుకూరలు , తీగకు కాసే కాయగూరలు , ఖర్జురము , తేనె , సోయాబీన్స్ , బీన్స్ సమృద్దిగా తీసుకోవాలి.
7. స్వీట్స్ , పంచదార , వేపుళ్లు , నిల్వపచ్చళ్ళు , మైదాపిండి వంటి పదార్ధాలకు దూరంగా ఉండాలి.
8.కూరల్లో నిమ్మకాయ పిండుకోవడం చాలా మంచిది. ఐరన్ శరీరాన్ని గ్రహించాలి అంటే C విటమిన్ అవసరం ఉంటుంది. ఇవి ఐరన్ టాబ్లెట్స్ వాడటం ద్వారా కన్నా ఆహారం ద్వారా సహజంగా ఐరన్ శరీరానికి అందించడం చాలా మంచిది.
9. తేనె వాడడం వలన కూడా కొద్దిరోజుల్లొనే మార్పు వస్తుంది.
10.ఖర్జూరంలో కూడా ఐరన్ శాతం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీటిని రోజుకి 10 నుంచి 12 వరకు తినాలి.
