ఏపీ మాజీ స్పీకర్, టీడీపీ సీనియర్ నేత కోడెల శివప్రసాద్ రావు ఆత్మహత్య చేసుకోవడం అత్యంత బాధాకరం. అందులో కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య చుట్టూ వివాదం నడుస్తోంది.కోడెల ఆత్మహత్య నేపథ్యంలో చంద్రబాబు చేయాల్సినంత రచ్చ చేయించాడు. ప్రభుత్వమే కేసులు పెట్టి వేధించడం వల్లే కోడెల ఆత్మహత్యకు పాల్పడ్డారనే వాదనను..టీడీపీ నేతలతో, ఎల్లోమీడియాతో ప్రచారం చేయించాడు. దీంతో ప్రభుత్వం కూడా ఒకరకంగా డిఫెన్స్‌లో పడిపోయింది. నిజానికి కోడెల సూసైడ్ వెనుక ప్రభుత్వ పాత్ర లేకపోయినా…బాబు శవరాజకీయంలో ఇరుక్కుపోయింది. ప్రభుత్వ వేధింపులు కారణమని టీడీపీ.. చంద్రబాబు కోడెలను పార్టీకి దూరంగా పెట్టారని వైసీపీ ఆరోపిస్తోంది. తాజాగా తెలుగుదేశం పార్టీ మాజీ ఎంపీ, టీడీపీ సినీయర్ నేత జేసీ దివాకర్ రెడ్డి సంచలన వాఖ్యలు చేశారు. కోడెల ఆత్మహత్య చేసుకుంటారని తనకు ముందే తెలుసు కాని అలాంటి నేత దూరం అవ్వడం భాదకారం అన్నారు. అంతేకాదు నేను ఎప్పుడో అనుకున్నా ఏదో ఒకటి చేసుకుంటారని. ఏదో ఒక రోజు ఆత్మహత్య చేసుకుంటారని తెలుసు అన్నారు. ప్రస్తుతం జేసి వాఖ్యలు సెషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.
#కోడెల #శివప్రసాద్ ఆత్మహత్య చేసుకుంటాడని ముందే అనుకున్నా – #జెసి #దివాకర్ #రెడ్డి.ఈ బతుకు ఇంకెందుకు బతకాలనుకున్నాడు.#KODELA #SIVAPRASAD #JC #DIWAKAR #REDDY
Posted by Anantapur Dist. AP on Tuesday, 17 September 2019